RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించనున్న ప్రభుత్వం: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల (RTC workers) సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనుందని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీతో (RTC JAC) ప్రభుత్వం చర్చలు సఫలమైన సందర్భంగా శనివారం నగరంలోని డిపో–1కు వెళ్లిన ఆయన కార్మికులతో మాట్లాడారు.

RTC Workers Issues | యూనియన్లను మళ్లీ పునరుద్ధరిస్తున్నాం..

కేసీఆర్​ హయాంలో నిరంకుశత్వంగా వ్యవహరించి యూనియన్లను పూర్తిగా తొలగించారని.. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం యూనియన్లను తిరిగి పునరుద్ధరిస్తుందని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. అతి త్వరలో యూనియన్ ఎలక్షన్స్ (union elections) కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పీఆర్​సీ (PRC hike) 11శాతం పెంచడానికి అంగీకారం కుదిరిందని.. ఆర్టీసీని ప్రభుత్వంలో (Telangana RTC) విలీనం చేసే ప్రక్రియ కూడా ప్రారంభం అయిందన్నారు.

RTC Workers Issues | ఉద్యోగుల బదిలీ..

హైదరాబాద్​లో (Hyderabad) ఉన్న ఉద్యోగులను ఎలక్ట్రిక్ బస్సుల (Electric buses) రాకతో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అనేది నిలిపేస్తున్నారని రామకృష్ణ తెలిపారు. ఆర్టీసీలో పెంచిన పనిభారం త్వరలోనే తగ్గుతుందని.. చట్టం ప్రకారం అందరూ ఉద్యోగుల్లాగే ఎనిమిది గంటల పని వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో 30 వరకు ఆమోదం తెలుపుతూ.. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

rtvd

ఇది కూడా చదవండి: MLC Appointments Approval | ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్.. సంతకం చేసిన గవర్నర్

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *