Passport Fee Hike | పాస్‌పోర్ట్ ఫీజు పెంపుపై హైకోర్టు జోక్యం.. విదేశాంగ శాఖకు కీలక ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పాస్‌పోర్టు ఫీజులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Passport Fee Hike | కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పాస్‌పోర్టు ఫీజులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు ( Delhi High Court )విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను వినతిపత్రంగా పరిగణించి, మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.

Passport Fee Hike | కేసు నేపథ్యం..

జులై 1 నుంచి అమలవుతున్న సవరించిన నిబంధనల ప్రకారం.. సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు పెరిగింది. అలాగే విదేశాల్లోని భారతీయులకు ఈ రుసుము 75 డాలర్ల (సుమారు రూ.7,165) నుంచి 125 డాలర్లకు (సుమారు రూ.11,942) పెరిగింది. ఈ ఫీజుల పెంపును సవాలు చేస్తూ ప్రవాసీ లీగల్ సెల్ (Migrant Legal Cell) అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

Passport Fee Hike | ప్రవాసులపై తీవ్ర ఆర్థిక భారం..

ఈ అదనపు భారం ముఖ్యంగా గల్ఫ్ దేశాలు , ఇతర ప్రాంతాల్లో పనిచేసే బ్లూ-కాలర్ కార్మికులతో పాటు ప్రవాస భారతీయులపై తీవ్రంగా పడుతోందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. పాస్‌పోర్ట్ అనేది విలాసవంతమైన వస్తువు కాదని, ఉపాధి, వీసా రెన్యూవల్, విదేశీ ప్రయాణాలకు అత్యంత అవసరమైన చట్టబద్ధమైన డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. ఈ అంశంపై విదేశాంగ శాఖ తగిన నిర్ణయం తీసుకుని, ఆ వివరాలను పిటిషనర్‌కు తెలియజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: LIC Unclaimed Funds | ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ అన్‌క్లెయిమ్డ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *