అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actor Ramesh Hospitalized | టాలీవుడ్ నటుడు, ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు రమేశ్ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు.
Actor Ramesh Hospitalized | న్యూరాలజిస్టులతో చికిత్స..
వైద్యుల సమాచారం ప్రకారం, రమేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో న్యూరాలజిస్టుల ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆస్పత్రికి చేరుకుని రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Jantar Mantar Violence | జంతర్‌మంతర్‌లో మళ్లీ హింస.. పోలీసులపైకి రాళ్లు, బాటిళ్లతో దాడి
రమేశ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.