అక్షరటుడే, వెబ్‌డెస్క్: Instagram Instants | సోషల్ మీడియా (Social Media) దిగ్గజం మెటా, తన పాపులర్ ప్లాట్‌ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’ వినియోగదారుల కోసం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న స్నాప్‌చాట్ (Snapchat), బీరియల్ (BeReal) వంటి యాప్‌లకు పోటీగా ‘ఇన్‌స్టాంట్స్’ (Instants) పేరుతో ఒక స్వతంత్ర (Standalone) యాప్‌ను లాంచ్ చేసింది.
Instagram Instants | ఏమిటీ ‘ఇన్‌స్టాంట్స్’ యాప్?
ఇది కేవలం ఫొటోలను తక్షణమే షేర్ చేయడానికి రూపొందించిన యాప్. ఇందులో ఆర్టిఫిషియల్ ఎడిటింగ్ లేదా ఫిల్టర్ల హంగామా ఉండదు. యాప్‌ను ఓపెన్ చేసి కెమెరాపై ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. ఫొటో దిగిపోతుంది. దానిని వెంటనే మీ స్నేహితులకు పంపవచ్చు.
నో గ్యాలరీ అప్లోడ్స్: ఈ యాప్‌లో ఫోన్ గ్యాలరీలోని పాత ఫొటోలను అప్లోడ్ చేసే అవకాశం ఉండదు. కేవలం అప్పటికప్పుడు కెమెరాతో తీసిన చిత్రాలను మాత్రమే పంపాలి. ఇందులో ఫిల్టర్లు గానీ, ఇతర ఎడిటింగ్ టూల్స్ గానీ ఉండవు. అవసరమైతే ఫొటోపై చిన్న టెక్స్ట్ రాసి పంపవచ్చు. మీరు పంపిన ఫొటోలు చాట్ లిస్ట్‌లో కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత వాటంతట అవే డిలీట్ అవుతాయి.
Instagram Instants | ఎవరికి అందుబాటులో ఉంది?
ప్రస్తుతానికి ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా స్పెయిన్ , ఇటలీ దేశాల్లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. అక్కడి ఫలితాలను బట్టి త్వరలోనే భారత్ సహా మిగిలిన దేశాల్లో విడుదల చేయనున్నట్లు మెటా ప్రతినిధులు తెలిపారు.

పోటీ పెంచుతున్న ఇన్‌స్టా:
ఇప్పటికే లాకెట్ (Locket), బీరియల్ వంటి యాప్‌లు ఈ తరహా ఫీచర్లతో ప్రాచుర్యం పొందాయి. యువత రియల్ టైమ్ ఫొటోలపై ఆసక్తి చూపిస్తుండటంతో, ఇన్స్టాగ్రామ్ కూడా తన పట్టును నిలుపుకోవడానికి ఈ ‘ఇన్‌స్టాంట్స్’ను రంగంలోకి దించింది.
ఇది కూడా చదవండి..: Tecno POP X | ఐఫోన్ లుక్‌తో.. బడ్జెట్ ఫోన్