అక్షరటుడే,కోటగిరి: Illegal Sand Transport | ఎలాంటి అనుమతుల్లేకుండా అడ్డూఅదుపు లేకుండా తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్లపై గ్రామస్తులు ఆగ్రహం చేశారు. గురువారం పోతంగల్ మండలం (Pothangal Mandal) కల్లూర్ గ్రామంలో ట్రాక్టర్లను అడ్డుకున్నారు.
Illegal Sand Transport | మంజీర పరివాహక ప్రాంతం నుంచి..
మంజీర పరివాహక ప్రాంతమైన కొడిచెర్ల నుంచి రాత్రనక..పగలనకా ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. పర్మిషన్ పేరుతో ఒక్కో ట్రాక్టర్‌తో రెండు ట్రిప్పుల వరకు ఇసుకను తోలుతున్నారని వారు మండిపడ్డారు. ఉదయం వేళల్లో సైతం ఇసుక రవాణా చేస్తుండడం వల్ల పొలాలకు వెళ్లే రైతులకు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పరిమిషన్లు లేకుండా ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
Illegal Sand Transport | శిథిలావస్థకు చేరుతున్న రోడ్లు..
కొడిచర్ల గ్రామం నుండి ఇసుక కల్లూరు మీదుగా తరలిస్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయని, బ్రిడ్జిలు కూలిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పగలు రాత్రి తేడాలేకుండా విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుందని వారంటున్నారు.. ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయాలని కల్లూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Seasonal Diseases | వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి..