అక్షరటుడే వెబ్డెస్క్: KTR Clarification | గ్లోబరీనా సంస్థతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారైనా సీఎంలా ప్రవర్తించాలని హితవు పలికారు. పేపర్ లీక్ ఘటనలపై తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.
KTR Clarification | రేవంత్ రెడ్డి ఆరోపణలు..
కొడంగల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2019లో ఇంటర్ పరీక్షల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకల వల్ల 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదే సంస్థ పేరు మార్చుకుని, కేటీఆర్ సహకారంతో కేంద్రంతో కుమ్మకై సీబీఎస్ఈ కాంట్రాక్టులు దక్కించుకుందని విమర్శించారు.
KTR Clarification | కేటీఆర్ ఘాటు స్పందన..
సీఎం ఆరోపణలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఖండించిన కేటీఆర్.. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తన లీగల్ టీమ్ ద్వారా సీఎంకు చట్టపరమైన నోటీసులు పంపుతామని హెచ్చరించారు. అసంబద్ధమైన ఆరోపణలన్నింటికీ తాను స్పందించనని, బురదలో కుస్తీ పట్టడం ఇష్టంలేకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
🏛️ 🚨 సీఎంకు కేటీఆర్ లీగల్ వార్నింగ్
🔸 తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
🔸 పేపర్ లీక్ల వంటి దురదృష్టకర ఘటనపై తప్పుడు ప్రచారం చేయడం ముఖ్యమంత్రి పదవికే మచ్చ అని మండిపడ్డారు. గ్లోబరెనా సంస్థతో… pic.twitter.com/4qJR71vn6g
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) July 23, 2026
ఇది కూడా చదవండి: Rahul Gandhi Demands | యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే.. మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం