Nizamabad Handloom Society | చేనేత సంఘం అధ్యక్షురాలిగా రాజేశ్వరి ఎన్నిక

చేనేత సంఘం అధ్య క్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నగరంలోని చేనేత సంఘం భవనంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad Handloom Society | నిజామాబాద్ (Nizamabad)​ చేనేత సహకార సంఘం ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. చేనేత సంఘం అధ్య క్షురాలిగా గుజ్జ రాజేశ్వరి (Gujja Rajeshwari) ఎన్నికయ్యారు.

Nizamabad Handloom Society | నగరంలోని చేనేత సంఘం భవనంలో..

నిజామాబాద్​ చేనేత సహకార సంఘం(Cooperative Society Elections) ఎన్నికలు నగరంలోని చేనేత సంఘ భవనంలో జరిగాయి. డైరెక్టర్లుగా గెలుపొందిన వారు గురువారం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. నాలుగు పదవులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్ష పదవికి మూడు నామినేషన్లు దాఖలు కాగా మిగిలిన పదవులకు రెండు నామినేషన్ల చొప్పున దాఖలయ్యాయి. అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష పదవికి కూడా నామినేషన్ వేసిన డైరెక్టర్ గుద్దేటి రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం నాలుగు పదవులకు గాను ఇద్దరు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం నాలుగు పదవులకు ఎన్నికలు జరగగా డైరెక్టర్లు అధ్యక్షురాలిగా గుజ్జ రాజేశ్వరిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా అవదూత విఠల్‌, ప్రధాన కార్యదర్శిగా పెంటి రాజు, కోశాధికారిగా నందాల నరేష్ ఎన్నికయ్యారు.

Nizamabad Handloom Society | చేనేత రంగ అభివృద్ధికి కృషి

విజయం సాధించిన అభ్యర్థులకు ఐదు చొప్పున ఓట్లు రాగా ఓటమి పాలైన అభ్యర్థులకు నాలుగు చొప్పున ఓట్లు పడ్డాయి. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్ పోషన్న వ్యవహరించారు. చేనేత కార్మికుల సంక్షేమం చేనేత రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అధ్య క్షురాలిగా ఎన్నికైన గుజ్జ రాజేశ్వరి తెలిపారు. అనంతరం సంఘ కార్యాలయం వద్ద జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, పద్మశాలి హాస్టల్ ప్రధాన కార్యదర్శి, గంట్యాల వెంకట్ నర్సయ్య, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బింగి ధరంవీర్, జిల్లా అద్యక్షుడు తన్నీరు శ్రీనివాస్, జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు తులసి, విష్ణువర్దన్, పెంటి రవి, సురుకుట్ల విజయ్, రాపెల్లి రాజు, దేవీదాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ‘మేము సీజేపీ ప్రతినిధులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం.. వారు నా కార్యాలయానికి లేదా నివాసానికి రావచ్చు..’ – JP NADDA 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *