NEET Paper Leak | నీట్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET Paper Leak | నీట్​ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్​టీఏకు సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్‌ లీక్‌ తర్వాత సంస్కరణల పురోగతిపై నివేదిక కోరంది. వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

నీట్-యూజీ పరీక్షకు సంబంధించి జరుగుతున్న ‘తప్పుల పరంపరకు’ ముగింపు పలకాలని, కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారేందుకు గల ప్రణాళికల వివరాలను తెలియజేయాలని ధర్మాసనం సేర్కొంది. నీట్ పేపర్ లీకుల అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.ఎస్. నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం తాము ఈ విషయాన్ని చాలా నిశితంగా పర్యవేక్షిస్తామని, క్రమం తప్పకుండా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

NEET Paper Leak | డేటాను ఎలా పరిరక్షిస్తారు

పూర్తిగా ఆన్‌లైన్ విధానానికి మారడానికి ఏం చేస్తున్నారో చెప్పాలని కోర్టు పేర్కొంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారినప్పుడు డేటాను ఎలా పరిరక్షిస్తారని ప్రశ్నించింది. భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, పిల్లల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పది రెట్లు ఎక్కువగా కృషి చేస్తోందని అన్నారు. పూర్తి వివరాలు సమర్పించడానికి సమయం కావాలని ఆయన కోరారు. దీంతో కోర్టు విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి..: CJP Protest | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు ఆపేది లేదు: సీజేపీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *