అక్షరటుడే వెబ్డెస్క్: NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్’ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యా వ్యవస్థలోని లోపాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్చలు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున నిరసనలు చేస్తుండటంతో.. ఆందోళనకారుల ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ‘కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’ వేదికగా ఈ కీలక సమావేశం కొనసాగుతోంది.
NEET Paper Leak | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్..
ఈ భేటీలో ప్రధానంగా నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు, భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఇరువర్గాలు చర్చిస్తున్నాయి. ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ నేతలు కేంద్ర ప్రతినిధుల ముందు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
NEET Paper Leak | కేంద్రం కీలక హామీలు..
మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక హామీలను సీజేపీ ప్రతినిధుల ముందుంచినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం మోపడం, పరీక్షా నిర్వహణ ఏజెన్సీలను ప్రక్షాళన చేయడం వంటి హామీలపై సీజేపీ నేతలు పట్టుదలతో చర్చలు జరుపుతున్నారు.
ఇది కైడా చదవండి: CJP Protest | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు ఆపేది లేదు: సీజేపీ