అక్షరటుడే, ఇందూరు : Intermediate Education | నగరంలో(Nizamabad) అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం డీఐఈవో రవికుమార్‌కు వినతిపత్రం ఇచ్చాయి.
Intermediate Education | కళాశాల భవనాన్ని సీజ్ చేయాలి
తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నగర అధ్యక్షుడు సుభాష్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (TSF) జిల్లా కార్యదర్శి మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు, సంబంధిత శాఖల అనుమతులు లేకుండా కళాశాల నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్న భవనాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కేశాపూర్ వద్ద ఉన్న నారాయణ ఇంటర్మీడియట్ కళాశాల (Telangana Intermediate Education) యాజమాన్యం విద్యాశాఖ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే ఓ ప్రైవేట్ భవనంలో కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. అలాగే కళాశాల షిఫ్టింగ్‌కు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై వెంటనే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Intermediate Education | సుభాష్‌నగర్‌లో సైతం..
సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న నారాయణ కళాశాల కూడా అవసరమైన అనుమతులు లేకుండానే నడుస్తోందని వారు ఆరోపించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ విచారణలో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే, సంబంధిత కళాశాల భవనాన్ని సీజ్ చేసి, కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక నాయకులు సతీష్, సురజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: NEET Paper Leak | కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ చర్చలు.. నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!