KTR NEET Protest | కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. బీఆర్​ఎస్​ హయాంలో పేపర్ లీక్‌లపై కౌంటర్!

నీట్ పరీక్షల అక్రమాలపై ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR NEET Protest | నీట్ పరీక్షల అక్రమాలపై ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు ఘటనలను గుర్తుచేస్తూ కేటీఆర్‌ను నేరుగా నిలదీసేలా హైదరాబాద్‌లో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. “మీ ప్రభుత్వంలో జరిగిందేంటి కేటీఆర్?” అనే హెడ్డింగ్‌తో పాటు, గతంలో జరిగిన పేపర్ లీక్‌ల వివరాలను సంవత్సరాల వారీగా ఆ పోస్టర్లలో స్పష్టంగా ప్రస్తావించారు.

KTR NEET Protest | ఫ్లెక్సీలో పేర్కొన్న అంశాలు..

గత ప్రభుత్వ హయాంలో వరుసగా జరిగిన పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు అంశాలను సంవత్సరాల వారీగా ఆ పోస్టర్లలో పొందుపరిచారు. జూలై 2016లో ఎంసెట్-II (మెడికల్) పేపర్ లీక్ కాగా, 2018లో వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. అలాగే మార్చి 2023లో తీవ్ర సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటన చోటుచేసుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2023లోనే వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు పేపర్ లీక్, హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీక్ జరిగాయి. అదే నెలలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రవాణాలో ఉండగా 30 పదో తరగతి సమాధాన పత్రాల బండిల్ మాయమైనట్లు కూడా ఆ పోస్టర్లలో ప్రస్తావించారు.

KTR NEET Protest | కేటీఆర్‌కు సూటి ప్రశ్న..

ఈ ఘటనలన్నింటిని ప్రస్తావిస్తూ పోస్టర్ కింద ఇంగ్లీష్‌లో ‘WHAT DID YOUR GOVT DO ABOUT IT KTR?’ (మీ ప్రభుత్వంలో దీనిపై ఏం చర్యలు తీసుకున్నారు?) అని సూటిగా ప్రశ్నిస్తూ ప్లకార్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నగరం నడిబొడ్డున వెలిసిన ఈ ఫ్లెక్సీలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతూ, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి.

ఇది కూడా చదవండి:  Government Schools | సర్కారు వర్సెస్​ ప్రైవేటు స్కూళ్లు.. సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *