అక్షరటుడే, కామారెడ్డి: Land Acquisition | జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న పనులకు భూసేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్లో రెండు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Land Acquisition | సాగునీటి ప్రాజెక్ట్‌లకు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ కీలకమని, ప్రతి దశను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. భూ యజమానుల సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, పరిహారం చెల్లింపులను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు త్వరగా అందేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Municipality | బల్దియా సమావేశాల్లో పనికొచ్చే ఒక్క పనీ జరగట్లేదు..: బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ..