Ravneet Singh Bittu | రవ్​నీత్ సింగ్ బిట్టూ రాజీనామా..ఎందుకంటే..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ravneet Singh Bittu | కేంద్ర సహాయ మంత్రి రవ్​నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యసభ సభ్యునిగా ఆయన పదవీకాలం ముగియడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రి పదవిని కూడా వీడాల్సి వచ్చింది.

రవ్​నీత్ సింగ్ బిట్టూ కేంద్ర మంత్రిగా కొనసాగేందుకు పార్లమెంట్ సభ్యత్వం తప్పనిసరి. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇటీవల ముగియడంతో రాజ్యాంగ ప్రకారం మంత్రి పదవిలో కొనసాగేందుకు అవకాశం లేకపోవడంతో రాజీనామా సమర్పించారు.

Family Asset Trust | ఆస్తి రక్షణకు ధనికుల ఫైనాన్స్ సీక్రెట్: తరతరాలుగా సిరిసంపదలను కాపాడే ‘ట్రస్ట్’ విధానం!

Ravneet Singh Bittu | మళ్లీ తీసుకుంటారా..?

బిట్టూ కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైల్వే శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆ శాఖలకు సంబంధించిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పునర్విభజించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపితే లేదా మరోసారి పార్లమెంట్ సభ్యుడైతే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రవ్​నీత్ సింగ్ బిట్టూ 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పంజాబ్ నుంచి ఎంపీగా గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

Ravneet Singh Bittu | మంత్రివర్గంలో జరిగే మార్పులపై ఆస్తకి..

అనంతరం పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించగా, అదే ఆధారంగా కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆ సభ్యత్వం ముగియడంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన రవ్​నీత్ సింగ్ బిట్టూ రాజీనామా రాజకీయంగా పెద్ద మార్పు కాకపోయినా, కేంద్ర మంత్రివర్గంలో త్వరలో జరిగే మార్పులు, కొత్త నియామకాలపై ఆసక్తి నెలకొంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *