Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఇందల్వాయి మండలం చంద్రాయణపల్లి, గన్నారంలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.

Paddy Procurement | ధాన్యం తీరుతెన్నుల పరిశీలన..

కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్​ పరిశీలించారు. రైతులను పలుకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా.. ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు (Farmers) వేచిచూడాల్సిన పరిస్థితి తలెత్తకూడదన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం జరిపించి, వెనువెంటనే నిర్దేశిత రైస్​మిల్లులకు పంపించాలని అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరిగితే, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ ప్రక్రియలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు.

Paddy Procurement | సన్నరకంతో పాటు దొడ్డురకం..

సన్నరకంతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్​ సూచించారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో షామియానాలు, తాగునీరు వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలన్నారు. తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.

ధాన్యం సేకరణలో గన్నీ బ్యాగులు వంటి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్స్​​ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, డీఏవో వీరస్వామి, ఏఎస్​వో అరవింద్ రెడ్డి, ఎంపీడీవో అనంత్ రావు తదితరులున్నారు.

ఇది కూడా చదవండి..: Pressure Cooker Blast | కుక్కర్ పేలి మహిళకు గాయాలు.. కామారెడ్డిలో ఘటన

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *