UP Teacher Cashless Scheme | ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం : యూపీ సీఎం యోగి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UP Teacher Cashless Scheme | ఆగ్రాలో ఉపాధ్యాయుల నగదు రహిత వైద్య చికిత్స పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశ పురోగతిని అభినందించని వారు ఏదో ఒక విధంగా సమాజంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారని యోగీ అన్నారు. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు సోషల్ మీడియా ఒక అవసరం అని పేర్కొన్నారు. మంచి కంటెంట్‌ను పోస్ట్ చేయండి, నకిలీ ఖాతాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

UP Teacher Cashless Scheme | సామాజిక భద్రత

ముఖ్యమంత్రి ఉపాధ్యాయ నగదు రహిత పథకం (Chief Minister’s Teacher Cashless Scheme) ప్రారంభించడం ఆనందంగా ఉందని యూపీ సీఎం తెలిపారు. ఈ సదుపాయం ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ మరియు స్వయం-ఆర్థిక (self-financed) నిర్వహణలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలన్నింటికీ వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, బోధనేతర సిబ్బందిని కూడా ఈ పథకంలో చేర్చామన్నారు. ఈ పథకం కింద సుమారు 10 లక్షల మంది ప్రయోజనం పొందుతారని చెప్పారు. నగదు రహిత వైద్య సదుపాయంతో పాటు, సామాజిక భద్రతకు హామీనిచ్చేలా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశామని తెలిపారు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ ఉపాధ్యాయుని కుటుంబానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.1.5 కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని యోగి తెలిపారు.

ఇది కూడా చదవండి : Jurala Project Inflow | జూరాలకు ప్రారంభమైన వరద..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *