Peddi Sudarshan Reddy | గ్రీన్​ చానెల్​ ద్వారా హైదరాబాద్​కు పెద్ది సుదర్శన్​రెడ్డి తరలింపు

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నాయకుడు పెద్ది సుదర్శన్​రెడ్డిని హైదరాబాద్​కు తరలించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddi Sudarshan Reddy | నర్సంపేట (Narsampeta) మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నాయకుడు పెద్ది సుదర్శన్​రెడ్డిని హైదరాబాద్​కు తరలించారు. హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి నుంచి గ్రీన్​ చానెల్​ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి (Yashoda Hospital)కి తరలిస్తున్నారు.

పెద్ది సుదర్శన్​ రెడ్డికి ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స చేశారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​, మాజీ మంత్రి హరీశ్​రావు ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.

Peddi Sudarshan Reddy | యశోద ఆస్పత్రికి..

సుదర్శన్​రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రికి తరలించారు. దీని కోసం పోలీసులు గ్రీన్​ చానెల్​ ఏర్పాటు చేశారు. అంబులెన్స్​ వెంట సుదర్శన్​రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కేటీఆర్​, హరీశ్​రావు బయలుద దేరారు.

 

దీనిని కూడా చదవండి : Peddi Sudarshan Reddy | బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డికి తీవ్ర అస్వస్థత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *