Navadurga Devi Bonalu | నవదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

నిజామాబాద్​ నగరంలోని పాత కలెక్టరేట్​ వద్ద నవదుర్గాదేవి ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Navadurga Devi Bonalu |నగరంలోని పాత కలెక్టరేట్​ వద్ద నవదుర్గాదేవి ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్బన్​(Nizamabad urban) ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ( MLA Dhanpal Surya Narayana) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు.

Navadurga Devi Bonalu |అంగరంగ వైభవంగా..

ఎమ్మెల్యే ధన్​పాల్​ మాట్లాడుతూ.. ప్రతియేటా టీజీవో ఎంప్లాయీస్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో బోనాల కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ నాగోళ్ల లక్ష్మీనారాయణ, శశాంక్ రెడ్డి, టీజీవో (TGO) ఎంప్లాయీస్ అధ్యక్షుడు అలుక కిషన్, అమృత్ కుమార్, చిట్టి నారాయణరెడ్డి, ఆకుల ప్రసాద్, దాస్, సత్యం, పెద్దోళ్ల నాగరాజు, చందన్ పాల్గొన్నారు. tyuri

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *