July 27 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..పాజిటివ్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడంతో క్రూడ్ ఆయిల్ ధర శాంతిస్తోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: July 27 Market Analysis | అమెరికా -ఇరాన్ Iran మధ్య పరస్పర దాడులు నిలిచిపోయాయి. 13 రోజుల పాటు ఇరాన్‌(Iran)పై దాడులు చేసిన అమెరికా America.. శుక్రవారం రాత్రి నుంచి దాడులను నిలిపివేసింది. ఇరాన్ సైతం తన ప్రతీకార చర్యలను నిలిపివేసినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది.

జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుముఖం పడుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు శాంతిస్తున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పాజిటివ్ గా మార్చుతోంది.

July 27 Gold Prices | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తగ్గుదలతో పుంజుకున్న బంగారం ధరలు.. చమురు ధరలు భారీగా పతనం

July 27 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరగ్గా.. నాస్‌డాక్ 0.64 శాతం పడిపోయింది. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.53 శాతం లాభంతో ఉంది.

July 27 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.34 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.87 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.90 శాతం లాభపడ్డాయి.

July 27 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ ( HangSeng) 0.60 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.51 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.24 శాతం లాభంతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.96 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.89 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.10 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.43 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,892 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 5,453 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 96.56 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.14 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.64 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.80 నుంచి 0.89 కు పెరిగింది.
  • విక్స్ 4.12 శాతం పెరిగి 14.03 కు చేరింది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.97 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *