అక్షరటుడే, వెబ్డెస్క్ : Bonda Uma Comments | టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు కౌంటర్ ఇచ్చారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన సంతాప సభకు బోండా ఉమ హాజరు అయ్యారు. ఆ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఆయన మాట్లాడారు. అంతేగాకుండా కాపుల ఉద్యమాన్ని పట్టించుకోకపోవడంతో 2019లో ఏపీలో టీడీపీ ఓడిపోయిందన్నారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత సీరియస్ అయ్యారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Bonda Uma Comments | వైసీపీ సభకు వెళ్లలేదు
తనకు ఎలాంటి నోటీసులు రాలేదని బోండా ఉమా తెలిపారు. అయితే వివరణ అడిగితే ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని తెలిపారు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరైనట్లు పేర్కొన్నారు. అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించానని తెలిపారు. గతంలో వైసీపీ నేత జక్కంపూడి నిర్వహించిన సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వెెళ్లారని ఉమా గుర్తు చేశారు. వాళ్లను కూడా వివరణ అడుగుతారా అని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా కాపులు ఏకమవుతారని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఇది కూడా చదవండి..: Balakrishna Health Update | బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు