అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IndiGo Emergency Landing | విమానం గాలిలో ఉండగా పొగ వచ్చింది. దీంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన రాజ్‌కోట్ (Rajkot)లో చోటు చేసుకుంది.
దుబాయ్ (Dubai) నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం కార్గో హోల్డ్ ప్రాంతంలో పొగను గుర్తించడంతో రాజ్‌కోట్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం కార్గో హోల్డ్‌లో పొగను గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే రాజ్‌కోట్‌లో ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండ్ అయిన తర్వాత వారందరూ విమానం నుంచి సురక్షితంగా దిగారు.
IndiGo Emergency Landing | అధికారుల దర్యాప్తు
విమానంలోని దిగువ కార్గో హోల్డ్‌లో పొగ వస్తున్నట్లు పైలట్లకు హెచ్చరిక అందడంతో రాజ్‌కోట్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలతో సహా అత్యవసర సహాయక బృందాలను వెంటనే రన్‌వే పక్కన మోహరించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా దిగారని విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలపై ఎయిర్‌పోర్టు, ఇండిగో అధికారులు విచారణ చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Madras High Court | ఆ ఉద్యోగాలు చెల్లవు.. విజయ్ సర్కార్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్