అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meta Apologizes | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలకు కోట్ల వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ అంశంపై నిరసనల నేపథ్యంలో ఆయన వీడియోలు విడుదల చేశారు.
భారత్‌లోని ఫేస్‌బుక్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కొద్దిసేపు నిలిచిపోయింది. ఆ కంటెంట్‌ను మెటా తొలగించింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మెటా సంస్థ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ తొలగింపు జరిగిందని ఆ సంస్థ పేర్కొంది. ఆ కంటెంట్ పొరపాటున తొలగించబడింది, ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించాం అని మెటా ప్రతినిధి తెలిపారు.
Meta Apologizes | వివరణ కోరే అవకాశం
ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తోందని సమాచారం. మెటా ఇచ్చిన వివరణ, అలాగే వీడియో తొలగింపునకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తోంది. వివరణ ఇవ్వడానికి మెటా (META) ప్రతినిధులను, సంబంధిత అధికారులను పిలిపించే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియోను తాత్కాలికంగా నిరోధించినందుకు గాను, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్‌ను పిలిపించిందని సమాచారం. జూలై 23న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో, బొద్దింక జనతా పార్టీ నిర్వహించిన నిరసన సందర్భంగా జెన్ జెడ్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం ఉంది.
Meta Apologizes | నెటిజన్ల ప్రశ్నలు
మోదీ తన ప్రసంగంలో పేపర్ లీక్‌లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను ప్రకటిస్తుందని తెలిపారు. పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశామని, కఠినమైన శిక్షలు, ప్రత్యేక కోర్టులను ప్రతిపాదించే ముసాయిదా చట్టాన్ని పార్లమెంటులో పెడుతామని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే సాంకేతిక కారణాలతో ఈ వీడియో తొలగించారా.. లేక కావాలనే చేశారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లీగల్ రిక్వెస్ట్ కారణంగా ఆ వీడియోను తొలగించినట్లు ఫేస్‌బుక్‌లో కనిపించింది.
దీనిని కూడా చదవండి : India Sri Lanka Test Squad | శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన