అక్షరటుడే వెబ్‌డెస్క్: Social Media Summons | ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి పలు సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. డేటా ప్రైవసీ , వ్యక్తిగత భద్రతా నిబంధనలపై ఆయా సంస్థలు వివరణ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల భద్రత కోసం, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, రైతులు, కార్మికులు వంటి వివిధ వర్గాల ప్రజా భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కోరింది.
Social Media Summons | సమావేశానికి గల ప్రాధాన్యం..
ఈ మేరకు ఆగస్టు 3న సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియా ప్రతినిధులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఇదే సమయంలో, నీట్ యూజీ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల నిరసనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
भाजपा सांसद डॉ. निशिकांत दुबे ने X पर ट्वीट कर जानकारी दी कि 3 अगस्त 2026 को शाम 4 बजे संसदीय स्थायी समिति (आईटी एवं संचार) ने Meta (Facebook, Instagram, WhatsApp), X (Twitter), Snapchat और Google के प्रतिनिधियों को बुलाया है।
उन्होंने कहा कि बैठक में महिलाओं, बच्चों, किसानों,… pic.twitter.com/PuVZTYLLIw
— CG Bhaskar (@CgBhaskarNews) July 28, 2026
ఇది కూడా చదవండి: Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. రైతుల్లో ఆనందం