తెలంగాణHyderabad Metro | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెట్రోలో ఎల్​ అండ్​ టీ వాటాలు...

Hyderabad Metro | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెట్రోలో ఎల్​ అండ్​ టీ వాటాలు స్వాధీనం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్​ మెట్రోలో ఎల్​ అండ్​ టీ వాటాలు స్వాధీనం చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్​ (Hyderabad) మెట్రోలో ఎల్​ అండ్​ టీ వాటాలు స్వాధీనం చేసుకుంది.

మెట్రోపై 100 శాతం ఈక్విటీని ఎల్​ అండ్ ​టీ (L&T) ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఈ నెల 30న రూ.15 వేల కోట్ల డీల్‌ పూర్తికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెట్రో బోర్డు (Metro Board)లో కీలక అధికారులను నియమించింది. హైదరాబాద్‌ మెట్రో ఛైర్మన్‌గా సీఎస్‌ రామకృష్ణరావు (Chief Secretary Ramakrishna Rao), డైరెక్టర్లుగా జయేష్‌ రంజన్‌, వికాస్‌ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్‌ రెడ్డిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ మెట్రో ఎండీగా కొనసాగనున్నారు.

Hyderabad Metro | ప్రభుత్వ నిర్వహణలో..

హైదరాబాద్​ మెట్రోను పీపీపీ విధానంలో ఎల్​ అండ్​ టీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇన్ని రోజులుగా నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. అయితే అప్పులు పేరుకుపోవడం, ఆదాయం తగ్గడంతో సంస్థ తప్పుకోవాలని భావించింది. ఈ క్రమంలో మెట్రో ఫేజ్​–2కు ప్రభుత్వం ప్రతిపాదించగా.. పనులు చేపట్టేందుకు ఎల్​టీ ఆసక్తి కనబరచలేదు. దీంతో ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించి వాటాను స్వాధీనం చేసుకుంది. సీఎం రేవంత్​రెడ్డి మెట్రో ఫేజ్​–2ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎల్అండ్​టీ వాటాల స్వాధీనం పూర్తయింది.

cm revanth 3

దీనిని కూడా చదవండి : Child Marriage | బాల్య వివాహాన్ని ఆపడానికి వెళ్లి.. పెళ్లి కూతురి చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....