Rega Kantha Rao Case | హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు..

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rega Kantha Rao Case | పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Rega Kantha Rao Case | కేసు నేపథ్యం..

ఈ నెల 26న పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఓ యువతి రేగా కాంతారావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఛానెల్ పేరుతో తనను ఫ్లాట్‌కు పిలిపించి వేధించారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేసుపై న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Rega Kantha Rao Case | పెళ్లి పేరుతో మోసం.. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు..?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *