Manhole Accident | మ్యాన్​హోల్​లో పడి వృద్ధుడి గల్లంతు

మ్యాన్​హోల్​లో పడి వృద్ధుడు గల్లంతు అయ్యాడు. ఈ ఘటన మియాపూర్​లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manhole Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. తెరిచి ఉన్న మ్యాన్​హోల్​లో పడి ఓ వృద్దుడు గల్లంతు అయ్యాడు.

నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. ఈ క్రమంలో మియాపూర్​లో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ ఓ వృద్ధుడు గల్లంతు అయ్యాడు. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హఫీజ్‌పేట్​లోని ప్రేమ్‌నగర్​కు చెందిన బాలయ్య (70) మ్యాన్​హోల్​లో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా, ఎన్​డీఆర్​ఎఫ్​, జీహెచ్​ఎంసీ సిబ్బంది బాలయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Manhole Accident | అధికారుల నిర్లక్ష్యంతో..

అక్కడ జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ఆ మ్యాన్‌హోల్ తెరిచి ఉంచినట్లు సమాచారం. ఆ ప్రదేశంలో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని బాలయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Car Fire | నడుస్తున్న కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *