అక్షరటుడే, వెబ్‌డెస్క్: Humanoid Robot Ban | అమెరికా, చైనాల మధ్య సాంకేతిక రంగంలో ఆధిపత్య పోరు మరో కీలక దశకు చేరింది. ఇప్పటికే సెమికండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), 5G నెట్‌వర్కింగ్ రంగాలపై ఆంక్షలు విధించిన అమెరికా.. తాజాగా చైనాకు చెందిన ‘హ్యూమనాయిడ్ రోబోట్ల’ దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించింది. జాతీయ భద్రత, డేటా గోప్యత, సైబర్ భద్రతా ముప్పులను కారణంగా చూపుతూ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
Humanoid Robot Ban | నిషేధానికి ప్రధాన కారణాలు..
చైనాకు చెందిన రోబోటిక్స్ కంపెనీలు ఇటీవల తక్కువ ధరలకే అత్యంత శక్తివంతమైన హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేస్తూ గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అయితే వీటిలో ఉండే కెమెరాలు, హై-ప్రెసిషన్ సెన్సార్లు, మైక్రోఫోన్లు, ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారంతో పాటు దేశీయ కీలక మౌలిక సదుపాయాలు, ఫ్యాక్టరీల డేటా చైనా సర్వర్లకు సులభంగా చేరే ప్రమాదం ఉందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Humanoid Robot Ban | గత వ్యూహాన్నే కొనసాగిస్తున్న అమెరికా..
గతంలో చైనాకు చెందిన హువావే (Huawei), డీజేఐ (DJI) వంటి టెలికాం, డ్రోన్ దిగ్గజ సంస్థలపై అమెరికా ఎలాంటి కఠిన ఆంక్షలు విధించిందో.. ఇప్పుడు అదే వ్యూహాన్ని రోబోటిక్స్ రంగానికి కూడా వర్తింపజేసింది. భవిష్యత్తులో గృహ, పారిశ్రామిక రంగాలలో హ్యూమనాయిడ్ రోబోట్ల పాత్ర అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ.. టెస్లా ఆప్టిమస్, ఫిగర్ ఏఐ, బోస్టన్ డైనమిక్స్ వంటి స్వదేశీ రోబోటిక్స్ తయారీదారులను ప్రోత్సహించడం, అమెరికా సరఫరా వ్యవస్థలను రక్షించుకోవడమే లక్ష్యంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Russia Oil Sanctions | రష్యా చమురు టార్గెట్‌గా అమెరికా కొత్త బిల్లు.. భారత్‌పై టారిఫ్‌ల ఎఫెక్ట్..?