అక్షరటుడే, ఇందూరు: Nizamabad Streams Overflow | జిల్లాలో(Nizamabad) వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్లో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఖరీఫ్‌కు సిద్ధమైన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Nizamabad Streams Overflow | వానాకాలం ప్రారంభమైన తర్వాత..
నగర శివారులోని ఆకుల కొండూర్‌లో చెరువు అలుగు పారుతోంది. వానాకాలం (Monsoon in Telangana) ప్రారంభమైన తర్వాత మొదటిసారి అలుగు పారుతుండడంతో స్థానికులు, నగరవాసులు చూసేందుకు తరలివస్తున్నారు. అలాగే కాలూర్–ఖానాపూర్‌కు వెళ్లే రోడ్డుపై ఉన్న వంతెనను తగులుతూ వరద ప్రవహిస్తోంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఈ కాలువ పొంగుతోంది. దీంతో ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇది కూడా చదవండి: నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు.. వాగులకు జలకళ