Stock Market Rally | బుల్ పరుగులు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశయ స్టాక్ మార్కెట్ లో బుల్ పరుగులు తీసింది. సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ 264 పాయింట్లు పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద రూ. 4 లక్షల కోట్లు పెరిగింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Rally | పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ పెరగడం వల్ల అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. జూన్ నెలలో భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఆరు నెలల్లోనే గరిష్ట స్థాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చింది.

Stock Market Rally | ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ..

బెంచ్ మార్క్ సూచీలను ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్లు ముందుండి నడిపించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.32 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.79 శాతం పెరిగాయి. గత సెషన్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికర కొనుగోలుదారులుగా నిలవడం కూడా మార్కెట్ల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.

Stock Market Rally | భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 708 పాయింట్ల లాభంతో ప్రారంభమై తొలుత 90 పాయింట్లు తగ్గినా.. అక్కడినుంచి మరో 432 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 191 పాయింట్ల భారీ లాభంతో మొదలై ప్రారంభంలో 40 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని మరో 147 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 888 పాయింట్ల లాభంతో 77,654 వద్ద, నిఫ్టీ 264 పాయింట్ల లాభంతో 24,250 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,593 కంపెనీలు లాభపడగా 1,652 స్టాక్స్ నష్టపోయాయి. 179 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 107 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 77 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈ లో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 4 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 25 స్టాక్ లాభపడగా.. 5 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్యూఎల్ 4.70 శాతం, ఇన్ఫోసిస్ 4.50 శాతం, ట్రెంట్ 2.56 శాతం, ఎల్టీ 2.55 శాతం, టాటా స్టీల్ 2.52 శాతం లాభపడ్డాయి.

Losers : అదానీపోర్ట్స్ 3.19 శాతం, ఎం అండ్ ఎం 1.51 శాతం, పవర్‌గ్రిడ్ 0.89 శాతం, బీఈఎల్ 0.39 శాతం, ఎన్టీపీసీ 0.09 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Pooja Precision IPO | ఊరిస్తున్న ఎస్ఎంఈ ఐపీవో.. తొలిరోజే 90 శాతం లాభాలు వచ్చే అవకాశం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *