Bhogapuram Airport | పని మాది.. ప్రచారం మాత్రం టీడీపీది : వైఎస్ జగన్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం , అభివృద్ధి పనులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం , అభివృద్ధి పనులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. “పని తమది.. ప్రచారం మాత్రం టీడీపీ వాళ్లది” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, పోలవరం ప్రాజెక్టులలో తమ ప్రభుత్వ హయాంలోనే అసలు పనులన్నీ జరిగాయని స్పష్టం చేశారు.

Bhogapuram Airport | జీఎంఆర్‌తో ఒప్పందాలు..

2020 జూన్‌లో జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి ల్యాండ్ అక్విజిషన్, ఆర్‌అండ్‌ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్‌ఓసీలు, భద్రతా అనుమతులు వంటి కీలక ప్రక్రియలన్నీ తమ హయాంలోనే పూర్తయ్యాయని జగన్ తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ పూర్తి చేసి, 4 గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించామన్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ కోసం రూ.967 కోట్లు, నీటి సరఫరాకు రూ.75 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.134.5 కోట్లు, రోడ్లకు రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు కలిపి మొత్తం సుమారు రూ.1,200 కోట్లు ఖర్చు పెట్టింది తమ ప్రభుత్వమేనని వివరించారు.

Bhogapuram Airport | చంద్రబాబుకు ప్రశ్నలు..

2019 ఎన్నికలకు నెల రోజుల ముందు ఎలాంటి పనులు చేయకుండా కేవలం శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు చేసింది ఏముందని ఆయన ప్రశ్నించారు. కనీసం తమ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోవాలని ఎద్దేవా చేశారు. పనులు తాము చేస్తే, ప్రచారం మాత్రం వేరేవాళ్లు చేసుకోవడం సరికాదని, భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో క్రెడిట్ అంతా తమ ప్రభుత్వానిదేనని జగన్ తేల్చిచెప్పారు.

 

ఇది కూడా చదవండి: Heavy Rain Alert | రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *