Trainee IPS Remand | ట్రైనీ ఐపీఎస్​ ఉదయ్​ కృష్ణారెడ్డికి రిమాండ్​

ట్రైనీ ఐపీఎస్​ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఉప్పర్​పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trainee IPS Remand | ట్రైనీ ఐపీఎస్​ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఉప్పర్​పల్లి కోర్టు (Upparpalli Court) 14 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్​గూడ జైలుకు తరలించారు.

హైదరాబాద్​ (Hyderabad)లోని నేషనల్ పోలీస్​​ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్​ కృష్ణారెడ్డి మరో ట్రైనీ మహిళా ఐపీఎస్​ను వేధించినట్లు కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను లైంగికంగా వేధించడంతో పాటు దాడి చేశాడని, బ్లాక్ మెయిలిక్​ పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Trainee IPS Remand | మిర్యాలగూడలో అరెస్ట్

కేసు నమోదు అయిన మరుసటి రోజు ఉదయ్​ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పరారీ అయ్యారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఆయనను మిర్యాలగూడలో అరెస్ట్​ చేసి హైదరాబాద్​కు తీసుకు వచ్చారు. బుధవారం ఉప్పర్​పల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్​ విధించారు.

దీనిని కూడా చదవండి : Krishna River Flood | కృష్ణానదికి భారీగా వరద..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *