జాతీయంRahul Gandhi remarks | దేశాన్ని అమ్ముతున్న ప్రధాని.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi remarks | దేశాన్ని అమ్ముతున్న ప్రధాని.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi remarks | దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నారని, ఆ క్రమంలో దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. హుగ్లీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

Rahul Gandhi remarks | బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ద్వేషం

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను కేవలం రాజకీయ పోరాటంగా చూడవద్దని, ఇది రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధమని రాహుల్ పేర్కొన్నారు. ఒకవైపు కాంగ్రెస్ నమ్ముతున్న ఐక్యత, సోదరభావం ఉంటే.. మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)ల ద్వేషం, హింసాత్మక ధోరణి ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Rahul Gandhi remarks | దేశాన్ని అమ్ముతున్నారు

ప్రధాని మోదీ తనను తాను దేశభక్తుడిగా చెప్పుకుంటూనే, మరోవైపు దేశాన్ని ధనికులకు అమ్ముకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. “మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల మధ్య భయాన్ని, విద్వేషాన్ని పెంచుతారు. బీజేపీ పేదల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. సామాన్యుల కోసం కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కూడా అస్తవ్యస్తం చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

rahul

Rahul Gandhi remarks | బెంగాల్ పరిస్థితిపై ధ్వజం

మమతా బెనర్జీ (Mamata Banerjee) తన చర్యలతో బెంగాల్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని రాహుల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు లోబడి ఉండాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సామాన్యుల అభివృద్ధి కంటే ధనికుల లబ్ధి కోసమే ప్రస్తుత పాలకులు పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

దీనిని కూడా చదవండి : AI Toll System | టోల్ గేట్ల దగ్గర ఆగకుండానే టోల్ కట్.. కేంద్రం సరికొత్త ‘ఏఐ’ ప్లాన్!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....