Nampally Court Hearing | ఒకే రోజు వ్యవధిలో… నాంపల్లి కోర్టుకు ఇద్దరు వేర్వేరు పార్టీల అగ్రనేతలు..

నాంపల్లిలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nampally Court Hearing | నాంపల్లిలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు కేసులకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు కోర్టు విచారణను ఎదుర్కోనుండటంతో కోర్టు ప్రాంగణం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Nampally Court Hearing | హాజరైన డిప్యూటీ సీఎం..

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka )గురువారం ( జులై 30 ) నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2022లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ నిర్వహించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే ఆయన నేడు స్వయంగా న్యాయస్థానం ముందుకొచ్చి హాజరయ్యారు.

Nampally Court Hearing | రేపు కోర్టుకు కేటీఆర్..

మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. 2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ (Formula-E) కార్ రేసింగ్ నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆయన విచారణను ఎదుర్కోనున్నారు. ఈ వ్యవహారంలో రూ.54.88 కోట్ల ప్రభుత్వ నిధులను మళ్లించారని, నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏసీబీ రూపొందించిన ఛార్జిషీట్‌లో కేటీఆర్‌ను ఏ-1 (A1) నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు కోర్టు ముందు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి:  Bandaru Ceremony Nizamabad | సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ‘బండారు’ కార్యక్రమం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *