Hyderabad Rain Alert | వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : సీపీ సజ్జనార్​

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనర్ సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Rain Alert | భారీ వర్షాల నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్ సజ్జనర్ (CP Sajjanar) సూచించారు. వాతావరణ కేంద్రం విడుదల చేసే సమాచారాన్ని, హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.

వర్షాల నేపథ్యంలో గురువారం పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలను, రోడ్డుపై ట్రాఫిక్ పరిస్థితులను సీపీ స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పోలీసు శాఖ.. జీహెచ్‌ఎంసీ సహా ఇతర అన్ని ప్రభుత్వ విభాగాలతో పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు.

Hyderabad Rain Alert | వాటికి దూరంగా ఉండాలి

వర్షం కురుస్తున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని సీపీ సూచించారు. నీరు ఎక్కువగా నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. అత్యవసరమైతే తప్ప వర్షం పడుతున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Traffic Advisory | వర్షాల ఎఫెక్ట్​.. ఐటీ కంపెనీలకు పోలీసుల ట్రాఫిక్ అడ్వైజరీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *