Operation Kavach Success | ఆపరేషన్ కవచ్​తో భారీ విజయాలు..: ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి జిల్లాలో మొదలు పెట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భారీ విజయాలు సాధించిన‌ట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Operation Kavach Successజిల్లాలో (kamareddy) మొదలు పెట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భారీ విజయాలు సాధించిన‌ట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ‘ఆపరేషన్ కవచ్’ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు.

Operation Kavach Success | ఏడాది కాలంగా..

ఎస్పీ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఏడాది కాలంలో పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడుల్లో 6 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్ట్ చేశారు. సుమారు 403.405 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.01 కోట్లు ఉంటుందని అంచనా. ఒడిశా నుంచి మహారాష్ట్ర నాసిక్‌కు తరలిస్తున్న 387.128 కిలోల గంజాయిని జాతీయ రహదారి 44పై క్యాసంపల్లి వద్ద పట్టుకున్నారు. అదేవిధంగా నర్సన్నపల్లి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల నుంచి గంజాయిని స్వాధీనం చేశారు. అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి 11 కేసులు, పశువుల అక్రమ రవాణాపై 3 కేసులు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై 3 కేసులు నమోదు చేశారు. ఒక గుట్కా రవాణా కేసులో రూ.43 లక్షల నగదును సీజ్ చేశారు.

Operation Kavach Success | అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్ట్​..

జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలు, ఆయుధాల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు 18 దొంగిలించిన బైక్‌లు, 5 దేశీయ తుపాకులు, 1 ఎయిర్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయ చోరీలు, ఆస్తి నేరాలు, ఏటీఎం దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్ట్ చేశారు. అట‌వీ జంతువుల వేటకు పాల్పడుతున్న 8 మంది నిందితులను గాంధారి పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. యజమానికి తెలియకుండా దొంగిలించిన 5 లక్షల విలువైన ట్రాక్టర్‌ను రెండు గంటల్లోనే రికవరీ చేసి అప్పగించారు. నాగిరెడ్డిపేట పరిధిలో 8 కిలోమీటర్ల మేర ఛేజింగ్ చేసి నలుగురు వాహన దొంగలను పట్టుకున్నారు. పోలీసుల సేవలు కేవలం కేసులకే పరిమితం కాలేదు.

Operation Kavach Success | ఎన్​ఫోర్స్​మెంట్​ ​..

ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా 5,16,984 వాహనాలను తనిఖీ చేసి, 1,19,052 మందిని పరీక్షించారు. 209 మంది అనుమానితులను గుర్తించి 3,572 డ్రంకన్​ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద మద్యం తాగి బస్సు నడుపుతున్న డ్రైవర్‌ను పట్టుకుని 45 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అంతర్రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలు 12 నుంచి 2కి తగ్గాయి. మానవీయంగా స్పందిస్తూ టేక్రియాల్ జంక్షన్ వద్ద ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలుడిని గుర్తించి కుటుంబానికి అప్పగించారు. సదాశివనగర్ ఎల్లమ్మ గుడి, లింగాపూర్‌లో జరిగిన దొంగతనాలను కొన్ని గంటల్లోనే ఛేదించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సమావేశంలో డిఎస్పీలు మధుసూదన్, శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy Education | ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత నాదే: సీఎం రేవంత్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *