Hyderabad Metro Government Takeover | తెలంగాణ ప్రభుత్వం అధీనంలోకి మెట్రో.. బోర్డులో కీలక అధికారుల నియామకం!

Naresh Chandan
Hyderabad Metro Government Takeover

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Metro Government Takeover | హైదరాబాద్​ మహా నగర రవాణా వ్యవస్థలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) కొనసాగిన హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో మెట్రో కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.akshara today .jpg rama kr

Hyderabad Metro Government Takeover | కీలక నియామకాలు ఇవే:

మెట్రో బోర్డులో అత్యున్నత స్థాయి అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోర్డు ఛైర్మన్​గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కే. రామకృష్ణరావు నియమితులయ్యారు.

మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD)గా శివేంద్ర ప్రతాప్ (IAS) తోపాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా జయేశ్‌ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, బి. శివధర్ రెడ్డి, అశోక్ రెడ్డి, జితేష్ వి. పాటిల్ వంటి సీనియర్ అధికారులు నియమితులయ్యారు.

వీరితో పాటు మెట్రో కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

Hyderabad Metro Government Takeover | రూ. 15 వేల కోట్లతో ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు:

మెట్రో ఫేజ్-1 నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ (L&T) తప్పుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఆ సంస్థకు ఉన్న 100 శాతం ఈక్విటీ వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 15,000 కోట్ల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుండి రూ. 13,615 కోట్ల రుణాన్ని పొందేందుకు మార్గం సుగమం అయింది.

మే 1 నుంచి కొత్త శకం:

ఈ స్వాధీన ప్రక్రియ ఏప్రిల్ 30, 2026 నాటికి పూర్తి కానుంది. మే 1, 2026 నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంస్థగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న ఎల్ అండ్ టీ సిబ్బందిలో సుమారు 115 మందిని ఏడాది పాటు సలహాదారులుగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Vaibhav Suryavanshi Century | SRHపై విరుచుకుపడ్డ RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 36 బంతుల్లో సెంచరీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *