Nizamabad Gambling Raid | నిజామాబాద్‌లో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడులు..ఆరుగురి అరెస్టు

నిందితుల వద్ద నుంచి రూ.75 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ఆటో, ఒక మోటార్‌సైకిల్​ను స్వాధీనం చేసుకున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Gambling Raid | నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్యనగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Nizamabad Gambling Raid | విశ్వసనీయ సమాచారంతో

పోలీసుల వివరాల ప్రకారం, ఆర్యనగర్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ బృందం దాడులు చేపట్టింది. ఘటన స్థలంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..పరీక్షల్లో అక్రమాలకు ఇక కఠిన శిక్షలు

నిందితుల వద్ద నుంచి రూ.75 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ఆటో, ఒక మోటార్‌సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నిందితులను నాలుగో టౌన్ పోలీసులకు అప్పగించారు.

Nizamabad Gambling Raid | ప్రత్యేక నిఘా..

ఈ ఘటనపై నాలుగో టౌన్ పోలీసులు సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *