Microsoft Market Value | చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్.. ఒక్కరోజే రూ. 42 లక్షల కోట్లు పెరిగిన సంపద..

అమెరికా స్టాక్ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒక్కరోజులోనే కంపెనీ సంపద రూ. 42 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Microsoft Market Value | అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అదరగొడుతూ స్టాక్ మార్కెట్ (Stock Market) చరిత్రను తిరగరాసింది. గురువారం నాటి ట్రేడింగ్ లో మైక్రోసాఫ్ట్ షేర్లు రికార్డ్ స్థాయిలో 16 శాతం లాభపడ్డాయి. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో ఆ కంపెనీ సంపద ఒక్కరోజులోనే 450 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.42 లక్షల కోట్లు) పెరిగింది. ఒక కంపెనీ మార్కెట్ వాల్యూ ఒక్క రోజులోనే ఈ స్థాయిలో పెరగడం వాల్‌స్ట్రీట్ చరిత్రలో తొలిసారి కావడం గమనార్హం. కాగా మైక్రోసాఫ్ట్ షేరు విలువ ఒక రోజులో ఈ స్థాయిలో పెరగడం 2008 తర్వాత ఇదే మొదటిసారి.

Microsoft Market Value | త్రైమాసిక ఫలితాల ప్రభావం

మైక్రోసాఫ్ట్ కంపెనీ రెండు రోజుల క్రితం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అజ్యూర్ క్లౌడ్ విభాగంలో ఆదాయం అంచనాలకు మించింది. ఈ విభాగంలో 43 శాతం వృద్ధి నమోదుచేసినట్లు కంపెనీ వెల్లడించింది. తమ ఏఐ అసిస్టెంట్ మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌కు విశేషమైన ఆదరణ లభిస్తోందని, దీని యÖజర్ల సంఖ్య 3 కోట్లు దాటిందని పేర్కొనడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని బలపరిచింది. దీంతో కంపెనీ షేర్లు ర్యాలీ తీశాయి.

Microsoft Market Value | ఎన్వీడియా రికార్డు బద్దలు..

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గతేడాది 2025 ఏప్రిల్‌లో ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ఎన్వీడియా బాగా లాభపడింది. ఆ కంపెనీ షేర్లు రాణించడంతో మార్కెట్ విలువ ఒక్కరోజే 440 బిలియన్ డాలర్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది రికార్డు. ఆ రికార్డును ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బద్దలు కొట్టింది.

ఇది కూడా చదవండి..: KOSPI Index | మిసైళ్లా దూసుకెళ్లిన కోస్పీ.. ఒక్కరోజే 18 శాతం పెరిగిన సూచీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *