India Foreign Policy Conference | భారత విదేశాంగ విధానంపై జాతీయ సదస్సు..సమకాలీన సవాళ్లపై నిపుణుల విశ్లేషణ

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు భారత విదేశాంగ విధానం సాధించిన పురోగతి, రూపాంతరం చెందిన తీరుపై పూర్తిస్థాయి అవలోకనాన్ని అందించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Foreign Policy Conference | మారుతున్న ప్రపంచ రాజకీయాలు, భౌగోళిక భద్రతా సవాళ్ల నడుమ భారత విదేశాంగ విధానం కొత్త రూపు సంతరించుకుంటోందని పలువురు ప్రముఖ విద్యావేత్తలు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని హుస్సేనియాలం ప్రభుత్వ మహిళా డిగ్రీ Degree కళాశాల college రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “India’s Foreign Policy: Recent Trends and Challenges” (భారత విదేశాంగ విధానం: తాజా ధోరణులు – సవాళ్లు) అనే అంశంపై ఖుర్షీద్ జా సెమినార్ హాల్‌లో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు.

Eluru Ambulance Incident | గుంతలో ఎగిరిపడ్డ అంబులెన్స్​..లేచి కూర్చున్న చనిపోయిందనుకున్న మహిళ

భారత ప్రపంచ వ్యవహారాల మండలి (ICWA), తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE)ల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అప్పయ్య చిన్నమ్మ అధ్యక్షత వహించారు.

India Foreign Policy Conference | సదస్సు ముఖ్యాంశాలు

అంతర్జాతీయ సంబంధాల్లో భారత్ ప్రాధాన్యం: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత విదేశాంగ విధానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలు, విదేశాంగ పరిణామాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

‘నాగరికత ఆధారిత సంబంధాలు’ (Civilisational IR): అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఉపేంద్ర చౌదరి ప్రధాన ప్రసంగం చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానాలు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. భారత్ తన సుదీర్ఘ సాంస్కృతిక, నాగరికత మూలాల ఆధారంగా (Civilisational International Relations) అంతర్జాతీయ సంబంధాలను పునర్నిర్వచిస్తున్న తీరును ఆయన విశ్లేషించారు.

India Foreign Policy Conference | సాంకేతిక ప్యానెల్ చర్చలు

ప్రారంభ సమావేశం అనంతరం మూడు విభాగాల్లో సాంకేతిక ప్యానెల్ చర్చలు కొనసాగాయి. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు ప్రధానంగా భారత విదేశాంగ విధానంలో వస్తున్న తాజా మార్పులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సవాళ్లు, మారుతున్న ప్రపంచ రాజకీయాలు – భారత్ దౌత్య వ్యూహాలపై దృష్టి సారించారు..

India Foreign Policy Conference | విదేశాంగ విధాన పరిణామక్రమం

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వి. శ్రీలత మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు భారత విదేశాంగ విధానం సాధించిన పురోగతి, రూపాంతరం చెందిన తీరుపై పూర్తిస్థాయి అవలోకనాన్ని అందించారు.

సదస్సును విజయవంతంగా నిర్వహించిన రాజకీయ శాస్త్ర విభాగాన్ని, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అప్పయ్య చిన్నమ్మ అభినందించారు. కన్వీనర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మహ్మద్ ఘౌస్ మాట్లాడుతూ.. ఈ వేదిక విద్యార్థులకు, పరిశోధకులకు అంతర్జాతీయ అంశాలపై స్పష్టమైన అవగాహనను ఇచ్చిందని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపారు.

ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఫర్హానా సుల్తానా సమన్వయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ నివేదితా రాయ్ (ICWA), ప్రొఫెసర్ అఫ్రోజ్ ఆలమ్ (MANUU), ప్రొఫెసర్ కృష్ణకుమార్ (OU), డాక్టర్ కే. భాస్కర్, డాక్టర్ కె. శ్రీదేవి, డాక్టర్ ఇస్లాముద్దీన్ ముజాహిద్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *