అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kerala Landslides | కేరళ (Kerala)లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండో చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగి పడడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Kerala Landslides | ఇడుక్కి జిల్లాలో..
ఇడుక్కి జిల్లాలోని ఎత్తైన ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక మహిళ ఇంటిపై పడటంతో ఆమె మృతి చెందింది. అలాగే శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు తెలిపారు.
Kerala Landslides | కొట్టాయం జిల్లాలో..
కొట్టాయం జిల్లాలోని పూంజర్‌లోని పయ్యనితోట్టంలో కొండచరియలు విరిగిపడడంతో మరో యువకుడు మృతి చెందాడు. అతని తల్లి శిథిలాల కింద కూరుకుపోయింది. మృతుడిని జానీ కుమారుడు జోసెఫ్‌గా గుర్తించామని, శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటుందని అనుమానిస్తున్న అతని తల్లి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
వాగమన్ ప్రాంతంలో..
ఇడుక్కి జిల్లాలోని వాగమన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక ఇంటిపై పడడంతో, అందులో ఒక వ్యక్తి చిక్కుకుపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలు రహదారిని అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Meta India FIR | మెటా భారత విభాగాధిపతిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్పందించిన సంస్థ