అక్షరటుడే వెబ్డెస్క్: Hyderabad Metro Organ Transport | ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణం పోసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. అవయవాల తరలింపును అత్యంత వేగవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేకంగా ‘గ్రీన్ ఛానెల్’ను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి అతి తక్కువ సమయంలో చేరవేశారు. సాధారణంగా రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కారణంగా ఈ దూరం దాటేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే, మెట్రో గ్రీన్ ఛానెల్ ద్వారా దాదాపు 14 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లోనే పూర్తి చేసి అవయవాలను ఆస్పత్రికి తరలించారు.
Hyderabad Metro Organ Transport | సిబ్బంది సమయస్ఫూర్తి..
సమయానికి అవయవాలు అందడంతో వైద్యులు బాధితులకు శస్త్రచికిత్సను విజయవంతంగా ప్రారంభించగలిగారు. అత్యవసర వైద్య సేవలందిస్తూ ప్రాణాలు కాపాడే ఇలాంటి క్లిష్టమైన కార్యక్రమాలకు హైదరాబాద్ మెట్రో ఎప్పుడూ ముందుంటుందని అధికారులు తెలిపారు. మెట్రో సిబ్బంది సమయస్ఫూర్తిని, వేగవంతమైన స్పందనను నగరవాసులు, వైద్యవర్గాలు అభినందించాయి.
Telangana: Hyderabad Metro enabled priority medical transit for a donor heart and lungs from CARE Hospitals Gachibowli, to KIMS Hospitals Secunderabad The organs travelled 14 km across 13 metro stations in 25 minutes supporting time-critical transplant through coordinated efforts pic.twitter.com/4FVs0XVRO9
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 1, 2026
ఇది కూడా చదవండి: West Bengal Terror Plot | బెంగాల్లో భారీ ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్