అక్షరటుడే, వెబ్డెస్క్ : Hardik Pandya | భారత్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గతంలో విడాకులు అయిన విషయం తెలిసిందే. అనంతరం పాండ్యా మహికా శర్మతో ప్రేమలో పడ్డాడు. శనివారం రాత్రి వీరు తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Hardik Pandya | తలానీలాలు సమర్పించి..
వేంకటేశ్వర స్వామి వారికి పాండ్యా తలానీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. పాండ్యాతో ఫొటోలు దిగడానికి పలువురు అభిమానులు పోటీ పడ్డారు. ఐపీఎల్లో పాండ్య ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. అయితే అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
VIDEO | Tirupati, Andhra Pradesh: Indian cricketer Hardik Pandya offers prayers during the Suprabhata Seva at the Sri Venkateswara Swamy Temple in Tirumala.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/HKdtPmcyC3
— Press Trust of India (@PTI_News) August 2, 2026
దీనిని కూడా చదవండి : Srisailam Reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద