Vizag Beach Tragedy | సముద్రంలో గల్లంతైన యువతి, యువకుడు

సముద్రంలో ఓ యువతి, యువకుడు గల్లంతు అయ్యారు. ఈ ఘటన వైజాగ్​ బీచ్​లో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizag Beach Tragedy | స్నేహితుల దినోత్సవం రోజు విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు సముద్రంలో గల్లంతు అయ్యారు. ఈ ఘటన వైజాగ్​ బీచ్​లో ఆదివారం చోటు చేసుకుంది.

కొంతమంది స్నేహితులు ఫ్రెండ్​షిప్​ డే సందర్భంగా వైజాగ్​ (Vizag) బీచ్​ వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. అందరు కలిసి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో సముద్రం ఒడ్డున రాయిపై నిల్చొని ఫొటో దిగుతుండగా.. పెద్ద అల వచ్చింది. అల ధాటికి పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడటానికి రాము అనే యువకుడు నీళ్లలోకి దిగాడు. అతడు సైతం గల్లంతు అయ్యాడు.

Vizag Beach Tragedy | గాలింపు చర్యలు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు, బోట్ల సాయంతో గాలిస్తున్నారు. కాగా నీతు, రాము విశాఖ పెదజాలరిపేట చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. బీచ్​లకు వెళ్లే ప్రజలు నీళ్లలోనికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి  : Nasha Mukt Yuva Abhiyan | యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలి : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *