Bonalu Festival Funds | ఉత్సవాల నిర్వహణకు బిచ్చమెత్తుకునే దుస్థితి: బండి సంజయ్

రాష్ట్రంలో హిందూ పండుగలు, ఉత్సవాల నిర్వహణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, నిధుల కోసం హిందువులు బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bonalu Festival Funds | రాష్ట్రంలో హిందూ పండుగలు, ఉత్సవాల నిర్వహణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, నిధుల కోసం హిందువులు బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Bonalu Festival Funds | నిధుల కేటాయింపులో వివక్ష..

రంజాన్ పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించిందని, కానీ 80 శాతానికి పైగా ఉన్న హిందువులు జరుపుకునే బోనాల ఉత్సవాలకు మాత్రం కేవలం రూ.20 కోట్లు ఇవ్వడం సరికాదని బండి సంజయ్ విమర్శించారు. జంట నగరాల్లోని 3 వేలకు పైగా దేవాలయాల్లో బోనాలు జరుగుతుంటే, ఈ అరకొర నిధులు ఏ మూలకు సరిపోవని ప్రశ్నించారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి సరిగ్గా నిధులు కేటాయించకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bonalu Festival Funds | ప్రభుత్వంపై విమర్శలు..

ఆలయ ప్రాంగణంలో ఎండలో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే భక్తులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. సీఎం, మంత్రులు కేవలం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే సరిపోదని, భక్తుల ఇబ్బట్లు పట్టించుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. హిందూ పండుగల పట్ల కాంగ్రెస్‌కు చులకన భావం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ కూడా గతంలో బోనాల నిధుల విషయంలో ఇలాగే నిర్లక్ష్యం చేసిందని గుర్తుచేశారు.

Bonalu Festival Funds |హిందూ సమాజం జాగృతం కావాలి..

ముందుముందు రాబోయే గణేష్ ఉత్సవాలతో పాటు అన్ని హిందూ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం జనాభా నిష్పత్తి ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్సవాల నిర్వహణలో హక్కులను కాపాడుకోవడానికి, ఆత్మగౌరవాన్ని చాటుకోవడానికి హిందూ సమాజమంతా జాగృతమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:  Komatireddy Venkat Reddy | అలా అయితేనే ఎన్నికల్లో పోటీ చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *