Komatireddy Venkat Reddy | అలా అయితేనే ఎన్నికల్లో పోటీ చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని ప్రజలు మాటిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Komatireddy Venkat Reddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మాట ఇస్తేనే పోటీ చేస్తానని తెలిపారు. లేదంటే ఎన్నికల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు.

తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినా చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా తకు సొంత ఇల్లు, ఆస్తులు లేవన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నాని చెప్పారు. వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే ఉందని ఆయన అన్నారు. ప్రజల మద్దతు ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

Komatireddy Venkat Reddy | సేవ కోసమే..

తాను స్వార్థం కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. నల్గొండ (Nalgonda) నగరం రూపు రేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మోడల్​ నగరంగా నల్గొండను మారుస్తామని ప్రకటించారు. మున్సిపాలిటీగా నల్గొండను ఇప్పటికే కార్పొరేషన్​గా మార్చామని గుర్తు చేశారు. మౌలిక వసతుల కోసం భారీగా నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Assam Flood Hero | అస్సాం వరదల్లో సాహసం.. 2 వేల మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *