అక్షరటుడే వెబ్‌డెస్క్: Kanwar Yatra | ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ వేదికగా సాగుతున్న కన్వర్ యాత్రలో రెండు భిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు రోడ్డు ప్రమాదం రూపంలో విషాదం చోటుచేసుకోగా.. మరోవైపు ఒకే గ్రామానికి చెందిన 150 మంది శివభక్తుల మహా పాదయాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది.
Kanwar Yatra | యాత్రికులపైకి దూసుకెళ్లిన వాహనం..
శివనామ స్మరణతో ముజఫర్‌నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న కన్వర్ యాత్రికులను ఓ పికప్ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kanwar Yatra | 800 కిలోమీటర్ల పాదయాత్ర..
మరోవైపు, ఇదే ముజఫర్‌నగర్ మీదుగా సాగుతున్న మధ్యప్రదేశ్ భక్తుల పాదయాత్ర స్థానికుల్లో స్ఫూర్తి నింపుతోంది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాకు చెందిన ఒకే గ్రామానికి చెందిన 150 మంది శివభక్తులు ఏకంగా 800 కిలోమీటర్ల యాత్రకు శ్రీకారం చుట్టారు. జులై 8న ఉత్తరాఖండ్‌లోని గోముఖ్ వద్ద పవిత్ర గంగాజలాన్ని స్వీకరించిన వీరు.. రోజుకు సగటున 40 కిలోమీటర్లు నడుస్తూ ముజఫర్‌నగర్‌కు చేరుకున్నారు. గమ్యం చేరేందుకు వారికి మరో 10 రోజుల సమయం పడుతుంది. గతేడాది ఈ గ్రామం నుంచి 30-40 మంది మాత్రమే వెళ్లగా.. ఈసారి ఆ సంఖ్య 150కి చేరింది. ఇందులో 6-7 మంది మహిళలు కూడా పురుషులతో సమానంగా నడుస్తుండటం విశేషం.
Kanwar Yatra | ఊరంతా ఒకే కుటుంబంలా..
‘ఇది శివుడి పిలుపు.. అందుకే ఊరంతా ఒకే కుటుంబంలా సంకల్పంతో కదిలివచ్చాం’ అని భక్తులు చెబుతున్నారు. వీరు ముజఫర్‌నగర్ చేరుకోగానే స్థానికులు ఘన స్వాగతం పలికి.. భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. ‘హర హర మహాదేవ్’ నినాదాలతో సాగుతున్న ఈ అరుదైన యాత్రను చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కన్వర్ యాత్రలో చోటుచేసుకున్న తీవ్ర విషాదం
శివనామ స్మరణతో సాగుతున్న కన్వర్ యాత్రికులను వేగంగా ఢీకొట్టిన పికప్ వాహనం
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుండి వాహనంతో పరారైన డ్రైవర్
ఘటనలో పలువురు యాత్రికులకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
కేసు… pic.twitter.com/uDekwLPCqR
— citizenspulse (@citizenspulse01) August 2, 2026
ఇది కూడా చదవండి: Uttarakhand Eve Teasing | ఈవ్‌టీజర్లకు వెరైటీ శిక్ష.. ముఖానికి ఇంక్ పూసి, దురద ఆకులతో దేహశుద్ధి