అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad GGH | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Rajanarsihma) తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.
సచివాలయంలో సోమవారం మంత్రి రాజనర్సింహ నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical College), జనరల్ హాస్పిటల్, ఇతర ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రజాప్రతినిధులు చేసిన సూచనల మేరకు సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లలో బెడ్ల కోసం ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లను బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటళ్లపై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
Nizamabad GGH | అంకాపూర్‌కు పీహెచ్సీ
అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. పీహెచ్సీ మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నందిపేట్ పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదించగా ఆయన సానుకులంగా స్పందించారు. జిల్లాలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వెల్లడించారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిల్లల వైద్య నిపుణులను ఇటీవల నియమించామన్నారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana University Recruitment | తెయూలో నియామకాలపై ‘ఎస్టీ కమిషన్’ సీరియస్.. అధికారులకు నోటీసులు