అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood Rescue | కామారెడ్డిలో(Kamareddy) అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం పట్టణాన్ని అతలాకుతలం చేసింది. ప్రధాన రహదారులు, కాలనీలు నీటితో నిండిపోయాయి.
Kamareddy Flood Rescue | రామారెడ్డి రోడ్డులోని..
భారీ వర్షాల కారణంగా రామారెడ్డి రోడ్డులోని సుభాష్ టాకీస్ సమీపంలో రోడ్డుపై భారీగా నీరు ప్రవహించింది. గొల్లపల్లి నుండి రంగంపేటకు పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ మార్గంలో వెళ్తుండగా.. సైలెన్సర్లో నీరు చేరడంతో బస్సు రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి పోలీసులు(Kamareddy police), ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోప్ సహాయంతో బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
Kamareddy Flood Rescue | సురక్షితంగా ప్రయాణికులు..
అనంతరం ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరో బస్సులో వారి గమ్యస్థానానికి పంపించారు. పోలీసు, ఫైర్ శాఖల సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు, సమన్వయంతో చేపట్టిన సహాయక చర్యల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పరిస్థితిని విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులను దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: వరద నీటిలో నిలిచిపోయిన బస్సు..