Greater Noida Fire | మంటలు ఆర్పుతుండగా కూలిన గోడ.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి

గ్రేటర్ నోయిడా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్‌లో మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Greater Noida Fire | గ్రేటర్ నోయిడా ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్‌లో మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో గోడ కూలిపోవడంతో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

గ్రేటర్ నోయిడా (Greater Noida)లోని ఒక ఎలక్ట్రానిక్ చిప్ తయారీ యూనిట్‌లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎకోటెక్-3 పారిశ్రామిక ప్రాంతంలోని ఐఎల్‌జిఐఎం (ILGIM) కంపెనీలో ఈ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పి వేస్తుండగా.. ఫ్యాక్టరీ లోపల ఉన్న ఒక గోడ, ఇనుప దూలం అకస్మాత్తుగా కూలిపోయాయి. దీంతో ఐదుగురు అగ్ని మాపక సిబ్బంది గాయపడ్డారు.

Greater Noida Fire | ఆస్పత్రికి తరలించగా..

గాయపడిన ఐదుగురు అగ్నిమాపక సిబ్బందిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఫైర్‌మ్యాన్ రోహిత్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ డ్రైవర్ తీరత్‌పాల్ చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. గాయపడిన మిగతా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది – హెడ్ కానిస్టేబుల్ డ్రైవర్ రాజ్‌పాల్ సింగ్, ఫైర్‌మ్యాన్‌లు మనీష్ కుమార్, అమిత్ కుమార్​గా గుర్తించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Udhayanidhi Trisha Remarks | త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలు.. మహిళా కమిషన్​కు ఫిర్యాదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *