అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Udhayanidhi Stalin Arrest | తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు సీఎం విజయ్, నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆయనపై తంజావూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
ఉదయనిధి స్టాలిన్ సోమవారం కావేరి జలాలపై నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం విజయ్, నటి త్రిష (Actress Trisha)ను ఉద్దేశించిన ఆయన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని టీవీకే ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా జాతీయ మహిళా కమిషన్‌ను సైతం ఆశ్రయించింది.
Udhayanidhi Stalin Arrest | బెయిల్ పిటిషన్ దాఖలు
టీవీకే నాయకుల ఫిర్యాదు మేరకు ఉదయనిధి స్టాలిన్‌పై ఆరు సెక్షన్ల కింద తంజావూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం విచారణ జరగనుంది. అంతలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమిళనాడులో హైటెన్షన్ నెలకొంది. ఉదయనిధి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీవీకే నాయకులు నిరసనలు తెలుపుతుండగా.. ఆయన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ డీఎంకే నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Greater Noida Fire | మంటలు ఆర్పుతుండగా కూలిన గోడ.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి