DY Patil | త్రిపుర మాజీ గవర్నర్ డి.వై. పాటిల్ కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత , త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ డాక్టర్ జ్ఞాన్‌దేవ్ యశ్వంత్రెవ్ (డి.వై.) పాటిల్ (90) తుదిశ్వాస విడిచారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: DY Patil | ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత , త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ డాక్టర్ జ్ఞాన్‌దేవ్ యశ్వంత్రెవ్ (డి.వై.) పాటిల్ (90) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. విద్య, వైద్యం, ప్రజాసేవ రంగాలకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

DY Patil | రాజకీయ , సేవా రంగ ప్రస్థానం..

1935 అక్టోబర్ 22న జన్మించిన డి.వై. పాటిల్ మహారాష్ట్రలో శాసనసభ్యుడిగా (MLA) ప్రజాసేవ ప్రారంభించారు. ఆ తర్వాత 2009 నుంచి 2013 వరకు త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా సేవలందించారు. విద్యా రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గాను 1991లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది.

DY Patil | విద్యా రంగానికి పెద్దపీట..

డి.వై. పాటిల్ స్థాపించిన ‘డి.వై. పాటిల్ గ్రూప్’ కింద దేశవ్యాప్తంగా 182కి పైగా విద్యాసంస్థలు, 7 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు విజయవంతంగా నడుస్తున్నాయి. విద్య, సామాజిక సంక్షేమ రంగాలకు ఆయన చేసిన సేవలు దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన మృతి పట్ల దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, విద్యావేత్తలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇది కూడా చదవండి:  MBBS BDS Admission | ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *